ఉగ్రవాద సంస్థ లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఈడీ షాక్
- ముంబై పేలుళ్ల సూత్రధారికి గురుగ్రామ్‌లో విలాసవంతమైన విల్లా
- పాక్ నిధులతో కశ్మీర్ వ్యాపారవేత్త అహ్మద్ షా కొనుగోలు
- గతేడాది షాను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
టెర్రర్ ఫండింగ్ కేసులో వటాలీని గతేడాది ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. గురుగ్రామ్ విల్లాను పాకిస్థాన్‌కు చెందిన ట్రస్టు ఫలాహీ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్) సమకూర్చిన నిధులతో వటాలీ ఈ విల్లాను కొనుగోలు చేసినట్టు ఈడీ భావిస్తోంది. ఈ సంస్థ సయీద్ ఆధ్వర్యంలోనే పనిచేస్తోంది. భారత్‌లో ఉగ్రదాడుల కోసం యూఏఈ నుంచి హవాలా ద్వారా ఈ నిధులు భారత్‌కు వచ్చినట్టు దర్యాప్తు సంస్థ భావిస్తోంది.