Mahesh Babu: మొత్తానికి మహేశ్ బాబును కూల్ చేసిన సుకుమార్

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబును కలిసి కథ చెబితే ఆయన ఓకే అంటాడా? లేదా? అనే విషయం అటుంచితే, అసలు ఆయనని కలుసుకోవడమే కష్టమని చెప్పాలి. అది అంత తేలికైన పని కాదనే విషయం దాదాపు దర్శకులందరికీ తెలుసు. అలాంటి మహేశ్ బాబుతో దర్శకుడు సుకుమార్ కి ఎంతో సాన్నిహిత్యం వుంది. ఈ కారణంగానే తన తదుపరి సినిమాను సుకుమార్ తో చేయాలని మహేశ్ బాబు అనుకున్నాడు. అయితే కథ విషయంలో చర్చలు పూర్తి కాలేదు.

కథలో మార్పులు చేయడం ఇష్టం లేని సుకుమార్, తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్నాడు. ఆ వెంటనే అభినందనలు తెలుపుతూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. అయితే సుకుమార్ ధోరణి మహేశ్ బాబు మనసు నొప్పించేలా ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపించింది.

ఇక ముందు ఈ కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చని అంతా చెప్పుకుంటున్నారు. దాంతో సుకుమార్ .. 'మహర్షి' సెట్ కి వెళ్లి మహేశ్ బాబును కలుసుకున్నాడు. మహేశ్ బాబుకి నచ్చేలా కథను సిద్ధం చేసుకుని వస్తానంటూ ఆయనను కూల్ చేశాడట. అనిల్ రావిపూడి సినిమా తరువాత మహేశ్ బాబు ..  సుకుమార్ ప్రాజెక్టు చేస్తాడేమో చూడాలి.
Go Back to Shorts
Mahesh Babu
sukumar

More Telugu News