Hyderabad: తన సోదరిని ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించినందుకు యువకుడి హత్య

షార్ట్స్‌లో చూడండి
తన చర్యలను నిలదీస్తున్నాడన్న ఆగ్రహంతో ఓ యువకుడిని హత్య చేశాడు మరో యువకుడు. ఇంటికి వచ్చి ప్రశ్నించిన యువకుడి గుండెలో కత్తి దించడంతో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని వీడియో గల్లీలో డేవిడ్‌, పృథ్వీరాజ్‌ (35) కుటుంబాలు నివసిస్తున్నాయి.

 పృథ్వీరాజ్‌ సోదరిని గత కొంతకాలంగా డేవిడ్‌ వేధిస్తూ ఏడిపిస్తున్నాడు. ఆదివారం రాత్రి కూడా డేవిడ్‌,  పృథ్వీరాజ్‌ సోదరితోపాటు అతని తల్లిని కూడా తిట్టాడు. ఈ విషయం తెలిసి అతన్ని నిలదీసేందుకు డేవిడ్‌ ఇంటికి  పృథ్వీరాజ్‌  వెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపు అరగంటపాటు ఇద్దరూ గొడవపడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోయిన డేవిడ్‌ తన వద్ద ఉన్న కత్తిని  పృథ్వీరాజ్‌ గుండెల్లో దించాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. డేవిడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
jubileehils
one murder

More Telugu News