కేటీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి రహస్య భేటీ.. మధ్యవర్తిత్వం చేసిన ఒవైసీ!
- ఇప్పటికే పార్టీ వీడిన కార్తీక్ రెడ్డి
- హైకమాండ్ తీరుపై సబిత అసంతృప్తి
- త్వరలోనే టీఆర్ఎస్ లోచేరే అవకాశం
తాజాగా కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంపై సబిత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కారెక్కడానికి ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు వీలుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వం నడిపారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు, లింగయ్య సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడిన నేపథ్యంలో సబిత రాజీనామా కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబిత గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 9,227 ఓట్ల తేడాతో ఆమె ఘన విజయం సాధించారు.