వధూవరులను ఆశీర్వదించి.. కుప్పకూలి మృతి చెందిన అమ్మాయి తండ్రి
- గుంటూరు జిల్లా రొంపిచర్లలో ఘటన
- పెళ్లి మండపానికి వెళ్తుండగా కుప్పకూలిన వధువు తండ్రి
- వాయిదా పడిన వివాహం
శనివారం ఉదయం 10:55కి వివాహం జరగాల్సి ఉండగా కాళ్లగోళ్ల వేడుక కోసం వధువు మౌనికను వరుడు ఇంటికి పంపించారు. ఈ క్రమంలో వధూవరులను రామకోటి రెడ్డి దంపతులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం ఇంటికి వెళ్లి తయారై పెళ్లి మండపానికి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఉండగానే వాహనంపై నుంచి ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే రామకోటి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లిని కూడా వాయిదా వేశారు.