మోదుగుల తన బావ కోసమే వైసీపీలో చేరారు: కోవెలమూడి రవీంద్ర ధ్వజం
- టీడీపీకి బలం, బలగం అంతా కార్యకర్తలే
- టీడీపీ లేకుండా చేస్తాననడం హాస్యాస్పదం
- టీడీపీ ఎప్పుడూ సముచిత స్థానాన్నే కల్పించింది
టీడీపీకి బలం, బలగం అంతా కార్యకర్తలేనని.. ఇది నేతలను నమ్ముకుని స్థాపించిన పార్టీ కాదని రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ గుంటూరులో చాలా బలంగా ఉందని.. దానిని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. మోదుగులను టీడీపీ ఒకసారి ఎంపీని, మరోసారి ఎమ్మెల్యేను చేసి గౌరవించిందన్నారు. ఆయన టీడీపీ నేతలను అగౌరవపరిచారు కానీ టీడీపీ ఎప్పుడూ ఆయనకు సముచిత స్థానాన్నే కల్పించిందన్నారు. మోదుగుల తన బావ కోసమే పార్టీ మారారని రవీంద్ర వ్యాఖ్యానించారు.