అశోక్ ను పట్టుకొచ్చి విచారిస్తే అన్ని విషయాలు బయటకువస్తాయి!: వైసీపీ నేత బుగ్గన
- ఏపీని ఐదేళ్లలో చంద్రబాబు భ్రష్టు పట్టించారు
- రెండు సిట్ లను హడావుడిగా ఎందుకు ఏర్పాటుచేశారు
- టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
ఐటీ గ్రిడ్స్ కేసును దారి మళ్లించేందుకే ఫామ్-7 విషయంలో 300కు పైగా కేసులను నమోదుచేశారని ఆరోపించారు. ఇక ఎన్నికల కమిషన్ బాధ్యతలను కూడా టీడీపీ తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ అశోక్ ను పట్టుకొచ్చి విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. సేవా మిత్ర యాప్ వ్యవహారంలో చంద్రబాబు నిండా మునిగారని ఎద్దేవా చేశారు.