kalyan ram: '118' చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను: మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో రూపొందిన '118' సినిమా ఈ నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన సినిమాగా మంచి మార్కులు కొట్టేస్తోంది. ఈ మధ్య కాలంలో కల్యాణ్ రామ్ కి సంతోషాన్నీ .. సంతృప్తిని కలిగించిన సినిమాగా దీనిని గురించి చెప్పుకుంటున్నారు.

'118' చూసిన సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు కూడా స్పందించాడు. ఆకట్టుకునే కథ .. ఆసక్తిని రేకెత్తించే కథనంతో సాగే ఈ సినిమాను చూస్తూ తాను చాలా ఎంజాయ్ చేసినట్టుగా చెప్పాడు. సినిమాటోగ్రఫర్ గా .. దర్శకుడిగా గుహన్ అద్భుతమైన పనితీరును కనబరిచారంటూ ప్రశంసించారు. ఈ సినిమా ఈ స్థాయిలో తెరపై ఆవిష్కరించబడటానికి కారణమైన టీమ్ కి ఆయన అభినందనలు తెలియజేశాడు. మహేశ్ బాబు స్పందనకి ఈ సినిమా టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆయనకి ధన్యవాదాలు తెలియజేసింది. 
Go Back to Shorts
kalyan ram
guhan

More Telugu News