విద్యార్థుల పాఠ్య పుస్తకాలలోకి అభినందన్ జీవిత కథ!
- రాజస్థాన్ లో పాఠ్యాంశంగా అభినందన్ సాహస గాథ
- ప్రతిపాదించిన విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్
- అభినందన్ విద్యాభ్యాసం జోధ్‌పూర్‌లో జరిగింది
అభినందన్ వైమానిక దాడుల సమయంలోనూ.. అనంతరం చూపిన ధైర్య సాహసాలు భావి తరాలకు చెందిన విద్యార్థులకు తెలియపరచాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. అభినందన్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా ఆయనను గౌరవిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా అభినందన్ విద్యాభ్యాసం జోధ్‌పూర్‌లో జరిగిందని గోవింద్ సింగ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.