భారత సైనికుల దాడిపై ఆడియోను విడుదల చేసిన మసూద్ తమ్ముడు మౌలానా అమర్!
- పాక్ మాటలన్నీ అబద్ధాలేనని నిరూపితం
- దాడి జరిగిన మాట వాస్తవమన్న మౌలానా
- ప్రతికారం తీర్చుకుంటామని వెల్లడి
జైషే క్యాంపులపై వైమానిక దాడులు నిజమేనని, జిహాద్ బోధనా కేంద్రంపై మాత్రమే దాడి జరిగిందని, ఇండియా చెబుతున్నట్టు కీలక స్థావరాలకు నష్టం కలుగలేదని ఆయన పేర్కొన్నాడు. బోధనా కేంద్రంపై దాడి తనను వేదనకు గురి చేసిందని, ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ మంచి అవకాశం ఇచ్చిందని అన్నాడు. తమపై దాడి ద్వారా యుద్ధానికి కాలు దువ్విందని, ఇండియాకు గుణపాఠం చెప్పి తీరుతామని అన్నాడు. కశ్మీర్ రక్షణ నిమిత్తం శిక్షణ పొందుతున్న వారిపై బాంబులేశారని, దీని ద్వారా కశ్మీర్ లోని ముస్లింలకు భారత్ మరింత దూరమైందని చెప్పాడు. కాగా, ఈ దాడిలో ఉగ్రవాద శిక్షణనిస్తున్న మాజీ ఐఎస్‌ఐ అధికారి, కల్నల్ సలీమ్ మరణించినట్టు తెలుస్తుండగా, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.