jaish e mohammed: పుల్వామా దాడితో సంబంధం లేదని జైషే మొహమ్మద్ తెలిపింది: పాకిస్థాన్

  • జైష్ నేతలు ప్రభుత్వంతో టచ్ లో ఉన్నారు
  • పుల్వామా దాడికి పాల్పడలేదని వారు చెప్పారు
  • మరోసారి ద్వంద్వ నీతిని ప్రదర్శించిన పాకిస్థాన్

ఇంత జరిగినా... ఉగ్రవాదులను వెనకేసుకురావడంలో పాకిస్థాన్ తీరు మారలేదు. పుల్వామా దాడులకు తామే బాధ్యులమని జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. సీఆర్ఫీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాది అజిల్ అహ్మద్ కూడా తాను జైష్ కు చెందినవాడినని ఓ వీడియోలో తెలిపాడు.

ఈ నేపథ్యంలో, పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ జైషే మొహమ్మద్ నేతలు పాక్ ప్రభుత్వంతో టచ్ లోనే ఉన్నారని తెలిపారు. అయితే పుల్వామా దాడికి తాము పాల్పడలేదని వారు తమతో చెప్పారని అన్నారు. మసూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని ప్రకటించిన పాకిస్థాన్... ఇంత వరకు అతనిపై చర్యలు కూడా తీసుకోలేకపోవడం గమనార్హం.

More Telugu News