sukumar: బాలీవుడ్ కి వెళ్లే ప్రయత్నాల్లో సుకుమార్?

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున మహేశ్ బాబు సినిమా కోసం కథను రెడీ చేస్తూనే, మరో వైపున నిర్మాతగాను సుకుమార్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన బాలీవుడ్ పై దృష్టి పెట్టాడనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోంది. హిందీ సినిమాలు చేయడానికి సుకుమార్ ఆసక్తిని చూపుతున్నాడట.

త్వరలోనే సల్మాన్ ఖాన్ .. ఆమీర్ ఖాన్ లను కలవడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఇంతవరకూ తాను చేసిన సినిమాల్లోని హైలైట్ సీన్స్ తో ఒక 'షో రీల్'ను సిద్ధం చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ 'షో రీల్' హిందీలో స్టార్ హీరోలకి చూపించి, అక్కడ అవకాశాలను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడని అంటున్నారు.  
Go Back to Shorts
sukumar

More Telugu News