జేసీని సవాలు చేస్తూ మీసం మెలేసిన వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు
- ప్రబోధానందనస్వామి ఆశ్రమం విషయంలో వివాదం
- పోలీసులను కించపరిచినట్టు జేసీపై ఆరోపణలు
- మీసం మెలేసి నాలుక కోస్తానని జేసీని హెచ్చరించిన మాధవ్
మాధవ్ వ్యాఖ్యలపై జేసీ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఎంపీపై ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంటూ అతడిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కేసు నమోదు చేసేందుకు పోలీసులు తిరస్కరించడంతో జేసీ తాడిపత్రి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు మాధవ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.