మద్యం కొంటే పొడిచేస్తా... వైన్ షాపు ముందు కత్తి పట్టుకుని గృహిణి హల్ చల్!

  • తమిళనాడులోని తిరుపూరులో ఘటన
  • తనను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానన్న కవిత
  • తాగుడుకు బానిసైన భర్త వైఖరిపై విసుగుతోనే
ఇల్లు గడిపే మార్గాన్ని పట్టించుకోకుండా నిత్యమూ మద్యం తాగుతున్న భర్తను చూసిన ఆమె, వినూత్న రీతిలో నిరసన తెలిపింది. తమిళనాడు, తిరుపూరులో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో మద్యం విక్రయాలు  సాగిస్తున్న టాస్మాక్‌ దుకాణానికి రెండు కత్తులతో వచ్చిన కవిత (25) అనే యువతి, ఎవరైనా మద్యం కొనుగోలు చేసేందుకు వస్తే కత్తితో పొడుస్తానని, తనను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేసింది. ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా అనేక టాస్మాక్‌ దుకాణాలు వెలిసి, సమయపాలన లేకుండా విక్రయాలు సాగిస్తున్నాయని తెలుస్తోంది.

ఇక్కడి పీఎన్‌ రోడ్డులోని పాండియన్‌ నగర్‌ లో ఉన్న దుకాణం వద్దకు వచ్చిన ఆమె నిరసనకు మందుబాబులు పరుగులు తీశారు. విషయం పోలీసులకు తెలిసి, వారు వచ్చేలోగానే, దుకాణ నిర్వాహకులు పారిపోగా, రెండుపెట్టెల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై కవితను స్టేషన్ కు తీసుకెళ్లి, కౌన్సెలింగ్ ఇచ్చి, ఈ తరహా నిరసనలు చట్టవిరుద్ధమని చెప్పి పంపించివేశారు.
Go Back to Shorts
Tamilnadu
House Wife
Wines

More Telugu News