టీడీపీకి బీసీలే వెన్నెముక.. కుల రాజకీయాలు, కుట్రలు బీసీలను పార్టీకి దూరం చేయలేవు!: మంత్రి యనమల
- నామినేషన్ దాఖలు చేసిన యనమల, దువ్వారపు
- సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన మంత్రి
- ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని వ్యాఖ్య
జాతీయ స్థాయిలో టీడీపీ కీలకపాత్ర పోషిస్తోందని మంత్రి యనమల వ్యాఖ్యానించారు. బీసీలే టీడీపీకి వెన్నెముక అనీ, ఏ కుట్రలు, కుల రాజకీయాలు బీసీలను టీడీపీకి దూరం చేయలేవని యనమల స్పష్టం చేశారు. 2019-24 విజన్ డాక్యుమెంట్‌కి తగ్గట్లుగా టీడీపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు.
కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల వెంట ఏపీ మంత్రులు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, జవహర్ వచ్చారు. నేటితో ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. రేపు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు.