Andhra Pradesh: కడప నుంచే చెబుతున్నా.. మీ కోటలు బద్దలు కొడతా: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • కిరాయి మూకలు, ప్రైవేట్ సైన్యానికి నేను భయపడను
  • ప్రజలకు రత్నాలు ఇస్తామని కొందరు అంటున్నారు
  • నేను రత్నాలివ్వలేను..ప్రజల కోసం పాటుపడతా

రాయలసీమలోని కర్నూలు జిల్లా నుంచి కడప జిల్లాలోకి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా కడపలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘జనసేన అధినేత రాయలసీమకు ఎలా వస్తాడో చూస్తాం’ అని తనను గతంలో హెచ్చరించిన వారిపై ఆయన విమర్శలు గుప్పించారు. కిరాయి మూకలు, ప్రైవేట్ సైన్యానికి తాను భయపడేవాడిని కాదని, వేల కోట్లు దోచుకుని, రౌడీయిజం చేసే వారికి భయపడనని అన్నారు. ‘కడప నుంచే చెబుతున్నానని, మీ కోటలు బద్దలు కొడతా’ అని వ్యాఖ్యానించారు.

‘జనసేన’ కుర్రోళ్ల పార్టీ అని అంటున్నారని, సత్తా చాటేది తామేనని పవన్ అనడంతో అభిమానుల చప్పట్లు మార్మోగిపోయాయి. తాము ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు రత్నాలు ఇస్తామని కొందరు ఆశపెడుతున్నారంటూ పరోక్షంగా వైసీపీపై విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనుక, ప్రజలకు తానేమీ రత్నాలు ఇవ్వనని, ఆ స్తోమత కూడా తనకు లేదన్న పవన్, వారి కోసం పాటుపడే హృదయం మాత్రం తనకు ఉందని అన్నారు. 

More Telugu News