ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దు.. విద్యా సంస్థలను మూసివేయాలి: సరిహద్దులో హై అలెర్ట్
- భయంతో ఇతర ప్రాంతాలకు ప్రజలు
- నియంత్రణ రేఖను దాటి దాడి చేయాలన్న పాక్
- యుద్ధ విమానాలను తరిమికొట్టాలన్న భారత్
ఎల్‌వోసీకి ఐదు కిలోమీటర్ల దూరంలోపు రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఉండే విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. గతరాత్రి పాక్ కాల్పులకు తెగబడటం.. ఎల్‌వోసీని దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.