పైలెట్ విషయంలో పాక్ మానవత్వంతో మెలగాలి: అసదుద్దీన్
- కష్ట సమయంలో పైలెట్ కోసం ప్రార్థిస్తున్నాం
- ప్రతి పార్టీ బందీల పట్ల మానవత్వం చూపాలి
- ప్రస్తుత పరిణామాలను పాక్ పక్కనబెట్టాలి
‘ఈ కష్ట సమయంలో ఈ వీర పైలట్‌తో పాటు.. అతని కుటుంబం కోసం మేం ప్రార్థన చేస్తున్నాం. జెనీవా కన్వెన్షన్స్‌లోని ఆర్టికల్ 3 ప్రకారం.. ప్రతీ పార్టీ బందీల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. పాకిస్థాన్ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఐఏఎఫ్ పైలట్ విషయంలో మానవత్వంతో మెలగాలని కోరుతున్నాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.