మా పైలెట్లు అందరూ సేఫ్.. పాకిస్థాన్ కస్టడీలో ఎవ్వరూ లేరు!: పాక్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన భారత్
- రెండు భారత యుద్ధవిమానాలను కూల్చివేశామన్న పాక్
- వింగ్ కమాండర్ అభినందన్ ను ప్రాణాలతో పట్టుకున్నట్లు వెల్లడి
- పాక్ ఆరోపణలను ఖండించిన భారత్
భారత వాయుసేనకు చెందిన పైలెట్లు అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది. పాకిస్థాన్ చెరలో భారత పైలెట్లు ఎవ్వరూ లేరని స్పష్టం చేసింది. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద స్థావరంపై నిన్న భారత వాయుసేన దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.