ఎన్నికల చిహ్నాల జాబితా నుంచి ‘ట్రక్కు’ , ‘ఇస్త్రీ పెట్టె’ గుర్తుల తొలగింపు

  • కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ
  • బ్యాలెట్ పేపర్ లో బోల్డ్ గా ‘కారు’ గుర్తు 
  • టీఆర్ఎస్ ఎంపీ వినోద్
టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు ‘ట్రక్కు’ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కారు’ గుర్తును అందరికీ కనిపించేలా బోల్డ్ గా బ్యాలెట్ పేపర్ లో ప్రచురిస్తామని ఈసీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, ‘ఇస్త్రీ’ పెట్టె గుర్తును కూడా ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి ఈసీ తొలగించింది.
Go Back to Shorts
TRS
mp
vinod
election commission
truck

More Telugu News