90 సెకన్లలోనే ఆపరేషన్ పూర్తి... 300 మంది టెర్రరిస్టులు ఖతం.. భారత వాయుసేన పవర్ ఇది!
- పక్కా ప్లాన్ తో దాడి చేసిన భారత్
- జైషే మొహమ్మద్ కీలక స్థావరం ధ్వంసం
- పర్వత ప్రాంతంలో దట్టమైన అడవుల్లో ఉన్న స్థావరం
ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంతో లక్ష్యాన్ని గుర్తించామని, ఈ క్యాంప్ జనావాసాలకు చాలా దూరంగా ఉందని అధికారులు తెలిపారు. భారత్ పై మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే మొహమ్మద్ కుట్ర పన్నిందని... ఈ క్యాంపులో ఆత్మాహుతిదళ సభ్యలకు ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు. వాయుసేన దాడులలో జైషే మొహమ్మద్ సీనియర్ కమాండర్లు, టెర్రరిస్టులు, ట్రైనీలు ఇతర జిహాదీలు భారీ ఎత్తున చనిపోయారని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. మరోవైపు, ఈ దాడుల్లో లేజర్ గైడెడ్ బాంబులను వినియోగించారు.