Guntur District: తాడేపల్లిలో నూతన గృహప్రవేశం చేయనున్న వైఎస్ జగన్

షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి త్వరలో వెళ్లనున్నారు. ఈ నెల 27న నూతన గృహ ప్రవేశం చేయనున్నారు. అదేవిధంగా, వైసీపీ నూతన కేంద్ర కార్యాలయాన్ని కూడా అదేరోజు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తలు... రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానం పలికారు.
Go Back to Shorts
Guntur District
tadepalli
YSRCP
ys jagan

More Telugu News