ఆ రోజున దాసరి గారు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి చలించిపోయాను: దర్శకుడు రేలంగి నరసింహారావు
- దాసరి గారు ఫోన్ చేస్తే వెళ్లాను
- ఆయన కోప్పడటం చాలాసార్లు చూశాను
- బాధపడటం మాత్రం అదే ఫస్టు టైమ్ అనుకుంటా
దాంతో నేను అక్కడికి వెళ్లాను .. ఓ మూడు రోజులపాటు దాసరిగారితోనే వుండిపోయాను. ఒక రోజు షూటింగ్ పూర్తయిన తరువాత హోటల్ కి తిరిగొచ్చాము. ఆ రాత్రి ఆయన తన కుటుంబ విషయాలను గురించి ప్రస్తావించారు. 'ఎంతో మందికి నేను లైఫ్ ఇచ్చాను .. మా అబ్బాయికి మాత్రం లైఫ్ ఇవ్వలేకపోతున్నాను. ఇది నా లోపమా .. వాళ్ల లోపమా .. దైవం అలా రాసి పెట్టిందా? అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. దాసరి గారు కోప్పడటం చాలాసార్లు చూశాను .. కానీ ఆయన బాధపడటం చూడటం మాత్రం అదే ఫస్టు టైమ్. సింహంలాంటి మనిషి అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి చలించిపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.