అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు ఖరారు... ఎవరికెన్ని సీట్లంటే..!
- బీజేపీ 5 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది
- అన్నాడీఎంకే 27, పీఎంకే 7 స్థానాల్లో పోటీ
- పుదుచ్చేరి ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తాం
నేడు ఆయన తమిళనాడు సీఎం పళనిస్వామితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పనిచేస్తాయని, ఎన్డీయేలో అన్నాడీఎంకే చేరిక ఖరారైందని పీయూష్ పేర్కొన్నారు. పొత్తులో భాగంగా తమిళనాడులో బీజేపీ 5 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుందని.. అన్నాడీఎంకే 27 స్థానాల్లో, పీఎంకే 7 స్థానాల్లో పోటీ చేస్తాయని పీయూష్ గోయెల్ తెలిపారు. పుదుచ్చేరి ఎన్నికల్లోనూ తాము కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు.