టీడీపీ నేతలు పార్టీని ధిక్కరిస్తున్నారు.. చంద్రబాబు వారికి రూ.1000 కోట్లు ఆశ చూపుతున్నారు!: విజయసాయిరెడ్డి
- వైసీపీ నేతల కొనుగోలుకు రూ.500 కోట్లు వెచ్చించారు
- అవినీతి విషయంలో చంద్రబాబు ప్రపంచ రికార్డు సృష్టించారు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనడానికి రూ.500 కోట్లు వెదజల్లాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కరిస్తుంటే రూ.1,000 కోట్లు ఆశచూపుతున్నారు. తండ్రీకొడుకులు నాలుగు చేతులతో దోచుకున్నారు. కరెప్షన్ లో ప్రపంచ రికార్డు సృష్టించి గ్లోరిఫై చేసే స్థాయికి ఎదిగారు చంద్రబాబు!’ అని ట్వీట్ చేశారు.