పోర్ట్ ఫోలియోలు కూడా ఖరారయ్యాయట... తెలంగాణలో ఏ శాఖకు ఎవరు మంత్రంటే..!
- నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ
- కొప్పుల ఈశ్వర్ కు విద్యా శాఖ
- మల్లారెడ్డికి విద్యుత్ శాఖ
కాగా, మంత్రివర్గ కూర్పుపై విపక్షాలు మండిపడుతున్నాయి. గత మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదని, ఇప్పుడు కూడా మహిళకు స్థానం లేకుండా కేసీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇక, ఈ పది మంది చేరికతో క్యాబినెట్ సంఖ్య 12కు చేరనుండగా, తెలంగాణలోని ఎమ్మెల్యే సీట్ల లెక్క ప్రకారం మరో ఆరుగురికి మంత్రులయ్యే చాన్స్ ఉంటుంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల్లో ఐదుగురు రెడ్డి, ముగ్గురు బీసీ, ఒక వెలమ, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. వీరిలో నలుగురు గతంలోనూ కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉండగా, ఆరుగురు కొత్త ముఖాలు.