Pulwama: అమర జవాన్లకు ఒక్కొక్కరికీ రూ.30 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందిస్తాం: ఎస్‌బీఐ

  • అమర జవానులందరికీ ఎస్‌బీఐ ద్వారానే వేతనం
  • రుణం పొందిన 23 మంది జవానులు
  • జవాన్ల రుణమాఫీ చేస్తామని అధికారుల వెల్లడి

పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందజేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరికీ ఎస్‌బీఐ ద్వారానే వేతనాలు అందుతుండటంతో ఒక్కొక్కరికీ రూ.30 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లలో 23 మంది ఎస్‌బీఐలో వేర్వేరు కారణాలతో రుణాలు తీసుకున్నారు. దీంతో ఈ జవాన్ల మొత్తం రుణాలను మాఫీ చేస్తామని అధికారులు ప్రకటించారు. అలాగే తమ ఉద్యోగులంతా స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని ఎస్‌బీఐ కోరడమే కాకుండా.. దీనికోసం ఎస్‌బీఐ యూపీఐని సైతం ఏర్పాటు చేసింది. కేవలం తమ ఉద్యోగులే కాకుండా.. బయటి వ్యక్తులు ఎవరైనా విరాళంగా అందించాలనుకుంటే ‘భారత్ కే వీర్’ను సంప్రదించాలన్నారు.

More Telugu News