telugu film industry: చిత్రరంగంలోకి అడుగుపెట్టి నలభై ఏళ్లు.. సినీ హాస్యనటుడు అలీకి సన్మానం

  • అలీని సత్కరించనున్న ‘సంగమం’ సాంస్కృతిక సంస్థ
  • ఈ నెల 23న విజయవాడలో వేడుక
  • హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం తదితరులు

ప్రముఖ హాస్యనటుడు అలీ సినీ రంగంలోకి అడుగుపెట్టి నలభై సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సాంస్కృతిక సంస్థ సంగమం ఆధ్వర్యంలో అలీని ఘనంగా సత్కరించనున్నారు. ఈ నెల 23న సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులు హాజరుకానున్నట్టు సమాచారం.  

కాగా, 1981లో విడుదలైన ‘సీతాకోకచిలుక’ చిత్రం ద్వారా బాలనటుడిగా అలీ వెలుగులోకొచ్చాడు. ఈ చిత్రానికి బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. ‘జంబలకిడి పంబ’, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, హలో బ్రదర్, ‘ముద్దుల ప్రియుడు’, ‘శుభలగ్నం’ తదితర చిత్రాల్లో హాస్యటుడిగా నటించాడు. 1994లో వచ్చిన ‘యమలీల’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ‘అమ్మాయి కాపురం’, ఘటోత్కచుడు, ‘పిట్టలదొర’ చిత్రాల్లోనూ హీరో పాత్రల్లో నటించాడు. 

More Telugu News