‘గల్లీబాయ్’ సూపర్.. రణ్ వీర్ సింగ్ పై హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ప్రశంసలు!
Add ap7am to your home Screen

‘గల్లీబాయ్’ సూపర్.. రణ్ వీర్ సింగ్ పై హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ప్రశంసలు!

  • ట్విట్టర్ లో స్పందించిన విల్ స్మిత్
  • హిప్ హాప్ ను ప్రపంచవ్యాప్తంగా చూడటం సంతోషంగా ఉందని వ్యాఖ్య
  • రణ్ వీర్ ను అభినందిస్తూ వీడియో
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ర్యాపర్ గా నటించిన గల్లీబాయ్ సినిమా ఇటీవల విడుదల అయింది. ఓ యువ గాయకుడు తన కలలను ఎలా నిజం చేసుకున్నాడన్న నేపథ్యంలో రూపొందిన గల్లీబాయ్ థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ఈ సినిమాపై స్పందించారు. హీరో రణ్ వీర్ సింగ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

‘యో.. రణ్ వీర్ సింగ్. కంగ్రాట్స్. నువ్వు గల్లీబాయ్ లో చేసిన నటన నాకు చాలా బాగా నచ్చింది. హిప్ హాప్ ను ప్రపంచవ్యాప్తంగా చూడటం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ మ్యాన్’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విల్ స్మిత్ పోస్ట్ చేశారు. కాగా, విల్ స్మిత్ ప్రశంసించడంతో రణ్ వీర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

గతేడాది విల్‌ స్మిత్‌ భారత పర్యటన సందర్భంగా రణ్‌వీర్‌ ఆయన్ను కలిశారు. కరణ్ జోహర్‌ నిర్మిస్తున్న ‘స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమాలోని ప్రత్యేక గీతం కోసం విల్‌ స్మిత్ 2018లో ఇండియాకు వచ్చారు. అదే సమయంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన గల్లీ బాయ్ లో రణ్ వీర్ కు జోడీగా ఆలియా భట్ నటించింది.
gully boy
Bollywood
movie
will smith
praise
Twitter
video

More Telugu News