వైఎస్సార్ కాంగ్రెస్ లోకి విజయవాడకు చెందిన టీడీపీ కీలక నేత దాసరి జైరమేష్?
- ఈ రోజు సాయంత్రం జగన్‌ని కలిసే అవకాశం
- కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న రమేష్
- టీడీపీ స్థాపించినప్పటి నుంచి కీలక సభ్యుడు
అయితే ఇటీవల కొంతకాలంగా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలే దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను కూడా వైసీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు రోజుల వ్యవధిలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా రమేష్ కూడా అదేబాట పట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.