అమెరికాను వణికిస్తున్న భయంకరమైన కొత్త వ్యాధి 'జొంబీ డీర్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాను వణికిస్తున్న భయంకరమైన కొత్త వ్యాధి 'జొంబీ డీర్'

  • జింకలు, దుప్పులలో విస్తృతంగా వ్యాపిస్తున్న వ్యాధి
  • మనుషులకు కూడా సోకే ప్రమాదం
  • ఇప్పటి వరకు అందుబాటులో లేని వ్యాక్సిన్
అగ్రరాజ్యం అమెరికాను ప్రస్తుతం భయంకరమైన కొత్త వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు జొంబీ డీర్. వన్య ప్రాణులైన జింకలు, దుప్పులలో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, అమెరికా ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది.

ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ సోకగానే దాని లక్షణాలు వెంటనే బహిర్గతం కావు. శరీరం మొత్తం వైరస్ విస్తరించిన తర్వాత కానీ వ్యాధి సోకినట్టు మనకు అర్థం కాదు. ఇదే ఇప్పుడు అంత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. అమెరికాలోని 24 రాష్ట్రాలతో పాటు... రెండు కెనెడియన్ ప్రావిన్స్ లలో కూడా ఈ వ్యాధి వ్యాపించినట్టు అధికారులు తెలిపారు.

ఈ వైరస్ సోకగానే నోటి నుంచి చొంగ కారడం, దప్పిక వేయడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరోవైపు ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. 
america
united states
bambi deer
virus

More Telugu News