Amaravathi: మంగళగిరి హత్యాచారం కేసు: జ్యోతి మృతదేహాన్ని నేడు బయటకు తీయనున్న పోలీసులు.. రీపోస్టుమార్టం!

  • జ్యోతి దుస్తులు సేకరించకుండానే మృతదేహం అప్పగింత
  • పోలీసుల ఒత్తిడితో మృతదేహాన్ని వెలికితీసి దుస్తులు ఇచ్చిన సోదరుడు
  • కుటుంబ సభ్యుల ఆందోళనతో ఎస్సై, సీఐ సస్పెన్షన్ 

ఏపీలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్యకేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు నేడు ఆమె మృతదేహాన్ని వెలికితీసి రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం విషయంలో నిర్లక్ష్యంగా వహించిన ఎస్సై, సీఐలను ఇప్పటికే సస్పెండ్ చేసిన ఎస్పీ.. ఎమ్మార్వో, ఉన్నతాధికారుల సమక్షంలో నేడు మరోమారు పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు.

అమరావతి టౌన్‌షిప్‌లో అత్యాచారానికి, ఆపై హత్యకు గురైనట్టు అనుమానిస్తున్న జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం జ్యోతి ఒంటిపై దుస్తులను పోలీసులు సేకరించకుండానే పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ఆ తర్వాత నాలుక్కరుచుకున్న పోలీసులు శాస్త్రీయ ఆధారాల సేకరణకు దుస్తులు అత్యంత కీలకం కావడంతో అవి కావాలంటూ జ్యోతి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు.

దీంతో ఆమె సోదరుడు ప్రభాకర్ సోదరి మృతదేహాన్ని వెలికి తీయించి దుస్తులు, వాచీని అప్పగించాడు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ.. ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారు.  

More Telugu News