వాళ్లను హనీమూన్ పూర్తి చేసుకుని రానివ్వండి.. అప్పుడే నేనేం చెప్పినా వింటారు: కార్తి
- పెళ్లికి సిద్ధమవుతున్న విశాల్
- ఆర్య, సాయేషాల పెళ్లి మార్చిలో అని ప్రచారం
- విశాల్, ఆర్య పెళ్లిపై ఫన్నీగా స్పందించిన కార్తి
ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా మీడియాతో ముచ్చటించిన కార్తి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కార్తిని మీడియా.. ‘విశాల్, ఆర్య పెళ్లి చేసుకోబోతున్నారు కదా.. మీరు వారికి ఏదైనా సలహా ఇస్తారా?’ అని ప్రశ్నించగా.. చాలా ఫన్నీగా సమాధానమిచ్చాడు. ‘ముందు వాళ్లను హనీమూన్ పూర్తి చేసుకుని రానివ్వండి. అప్పుడేగా నేనేం చెప్పినా వారు వినేది’ అని సరదాగా తెలిపాడు కార్తి.