ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
- ఓటర్లకు లక్ష గడియారాలు పంపిణీ చేస్తున్నారు
- వీటి విలువ రూ.10 కోట్లు ఉంటుంది
- దీనిపై నిగ్గు తేల్చాల్సిందిగా ఈసీని కోరా: తుడా చైర్మన్
ఒకో ఓటుకు ఐదు వేల రూపాయలు అడగమని వైసీసీ అధినేత జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా ఈసీ స్పందించి, జగన్ పై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి కనుక ఆయనపై ఈసీ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతి సంపాదనతో కోట్లను కూడగట్టిన జగన్, ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కో నియోజకవర్గంలో కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని, దీనిపై ఈసీ నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు.