ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చింది అందుకే: అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వచ్చింది అందుకే: అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు

  • కాంగ్రెస్‌లో పుట్టుకతోనే ప్రధాని పదవి రిజర్వు అయిపోతుంది
  • రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదని ప్రియాంక రాజకీయాల్లోకి
  • కాంగ్రెస్‌లో చాయ్‌వాలా ప్రధాని కాగలిగేవారా?
కాంగ్రెస్ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాపై  బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అన్న (రాహుల్ గాంధీ) పెళ్లి చేసుకోలేదు. అందుకే, సోదరి (ప్రియాంక గాంధీ) రాజకీయాల్లోకి వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. గోద్రాలో నిర్వహించిన పార్టీ సమావేశంలో షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై మరోమారు విరుచుకుపడ్డారు.

ఆ పార్టీలో ప్రధానమంత్రి పదవి జన్మతః రిజర్వు అయిపోతుందని ఎద్దేవా చేశారు. అందుకనే ఎలాగూ అన్నకు పెళ్లి కాలేదని సోదరి రాజకీయాల్లోకి వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చాయ్‌వాలా నరేంద్రమోదీ ప్రధాని అయ్యారని, బూత్ లెవల్ కార్యకర్త అయిన తాను బీజేపీకి అధ్యక్షుడిని కాగలిగానని, కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య ఉన్న తేడా ఇదేనని షా వివరించారు. కాంగ్రెస్‌లో ఇలా ఊహించను కూడా ఊహించలేమని షా పేర్కొన్నారు.
Amit Shah
BJP
Priyanka Gandhi vadra
Rahul Gandhi
Congress

More Telugu News