vijayalalitha: విజయశాంతి మా అక్కయ్య కూతురు .. ఆ సినిమాతో పరిచయం చేశాను: సీనియర్ నటి విజయలలిత

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై విజయలలిత లేడీ జేమ్స్ బాండ్ అనిపించుకున్నారు. తెలుగుతోపాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. " చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఇష్టం .. అందువలన 'భీమాంజనేయ యుద్ధం' సినిమాలో 'రంభ' పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. తెలుగులో నా మొదటి సినిమా అదే. డాన్స్ పరంగా ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇక నిర్మాతగా నా మొదటి సినిమా 'దేవుడు మావయ్య'. ఈ సినిమా నాకు నష్టాలనే తీసుకొచ్చింది. ఆ తరువాత 'ఆడదాని సవాల్' సినిమాను నిర్మించాను. ఈ సినిమా ద్వారానే విజయశాంతిని పరిచయం చేశాను. తాను మా అక్కయ్య కూతురు. ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేయవలసిన బాధ్యత నాపై వుంది కనుక అలా చేశాను. తను స్టార్ హీరోయిన్ అయిన తరువాత గర్వపడ్డాను'' అని చెప్పారు.
Go Back to Shorts
vijayalalitha
vijayashanthi

More Telugu News