కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు దూకుడు!
- నిన్న ఏపీ భవన్ వేదికగా ధర్మపోరాట దీక్ష
- విజయవంతం కావడంతో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహం
- నేడు పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ కు
ఈ క్రమంలో ఈ ఉదయం 10 గంటల సమయంలో తెలుగుదేశం నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యే ఆయన, ఆపై కొద్దిమందితో కలిసి పాదయాత్ర ప్రారంభిస్తారు. పాదయాత్ర మధ్యలో పలువురు జాతీయ నాయకులు ఆయన్ను కలుస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చంద్రబాబు రాష్ట్రపతిని కలుస్తారు. విభజన హామీలను నెరవేర్చాలని మెమొరాండాన్ని సమర్పిస్తారు.