తెలంగాణలో పారదర్శక మైనింగ్ విధానం.. ఆదాయం ఏకంగా 100 రెట్లు పెరిగింది!: కేటీఆర్
- 2004-14 మధ్య కేవలం 39.4 కోట్ల ఆదాయం
- నాలుగేళ్ల టీఆర్ఎస్ కాలంలో రూ.1600 కోట్ల రెవెన్యూ
- ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఉదాహరణకు 2004-14 మధ్యకాలంలో ఏటా రూ.3.94 కోట్ల చొప్పున ప్రభుత్వానికి రూ.39.4 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరిందని అన్నారు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన 2014-18 మధ్యకాలంలో మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఆదాయం ఏకంగా రూ.1,600 కోట్లకు చేరుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఆదాయం 100 రెట్లు పెరిగిందన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ లో ప్రశంసించారు.