ఈ తాతగారు సీనియర్‌ డ్రైవర్‌...97 ఏళ్ల వయసులో లైసెన్స్‌ రెన్యువల్‌

  • భారత సంతతి వ్యక్తి మెహతా ఘనత ఇది
  • 2023 వరకు గడువు పొడిగించిన అధికారులు
  • దుబాయ్‌లో కారు నడిపే సీనియర్‌ ఇతనే కావచ్చన్న భావన
ఆ తాతగారి వయసు 97 ఏళ్లు. అయినా తన ఫిట్‌నెస్‌ ఏమీ తగ్గలేదంటున్నారాయన. ఆయన మాటలను కొట్టేయలేక దుబాయ్‌ ప్రభుత్వం ముదిమి మీదపడిన వయసులోనూ ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను నాలుగేళ్లపాటు పొడిగించింది. 2023 వరకు ఆయన లైసెన్స్‌ గడువు పొడిగించడంతో దుబాయ్‌ రోడ్లపై కారు  నడిపే అత్యంత సీనియర్‌ ఇతనే కావచ్చునని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...భారత సంతతికి చెందిన టెహెంటెన్‌ హోమీ ధున్జీబోయ్‌ మెహతా దుబాయ్‌లో స్థిరపడ్డారు. 1922లో జన్మించిన మెహతా వయసు ప్రస్తుతం 97 ఏళ్లు. ఇటీవలే ఆయన లైసెన్స్‌ గడువు ముగియడంతో రెన్యువల్‌ చేయాలని అక్కడి విభాగానికి దరఖాస్తు చేశారు. మెహతా ఫిట్‌నెస్‌ను పరిశీలించిన అధికారులు నాలుగేళ్లపాటు పెంచారు.
Go Back to Shorts
senior citizen
dubai
draiving licence

More Telugu News