KA Paul: కేఏ పాల్ తల్లి కన్నుమూత!

షార్ట్స్‌లో చూడండి
క్రైస్తవ మత బోధకుడు, ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన కేఏ పాల్ తల్లి కిలారి సంతోషమ్మ, గత రాత్రి కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. అనారోగ్యంతో విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, రాత్రి 8.30 గంటల సమయంలో మరణించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కేఏ పాల్ స్వయంగా తెలియజేశారు. ఆమె ప్రస్తుతం స్వర్గంలో మరింత మెరుగైన జీవనాన్ని గడిపేందుకు వెళ్లిందని వ్యాఖ్యానించారు. ప్రభువుతో ఆమె కలిసిపోయిందని చెప్పారు. తనకు సొంత ఇల్లు, సొంత కారు, కనీసం ఒక్క రూపాయి డబ్బు లేకపోయినా, పేదల బాగు కోసం ఆమె నిత్యమూ ప్రార్థించేవారని అన్నారు. ఆమె మృతితో ప్రపంచమంతా సంతాపాన్ని తెలుపుతోందని అన్నారు. జనవరిలో ఆమె తనతో మాట్లాడుతూ, ప్రజాశాంతి తరఫున ఎన్నికల్లో నిలబడాలని దీవించారని చెప్పారు.



Go Back to Shorts
KA Paul
Santoshamma
Died
Vizag

More Telugu News