తండ్రీకొడుకుల అవినీతి ప్రభుత్వం పోవాల్సిన టైమ్ వచ్చింది.. బీజేపీ సభకు దిష్టి తీసినందుకు థ్యాంక్స్!: ప్రధాని మోదీ
- చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మలేదు
- అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు
- గుంటూరు జన చైతన్య సభలో మాట్లాడిన మోదీ
సాధారణంగా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు దిష్టి తగలకుండా పెద్దలు నల్ల చుక్క పెడతారని ప్రధాని అన్నారు. గుంటూరులో జరుగుతున్న బీజేపీ సభకు దిష్టి తగలకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, టీడీపీ నేతలు నల్ల బెలూన్లను ఎగురవేశారనీ, ఇందుకోసం ధన్యవాదాలని మోదీ అన్నారు. అనంతరం జై ఆంధ్రా, భారత్ మాతాకీ జై అని నినాదాలతో సభను ముగించారు.