అమరావతిని ‘ఆంధ్రా ఆక్స్ ఫర్డ్’ అనేవారు.. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ!
- అగ్రగాములైన ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు
- గుర్రం జాషువా, తిక్కనలకు గుంటూరు జన్మినిచ్చింది
- ఏటుకూరు ప్రజా చైతన్య సభలో మోదీ
స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, నాయుడమ్మ సహా ఈ గడ్డపై జన్మించిన హేమాహేమీలకు నమస్కరిస్తున్నట్లు మోదీ తెలిపారు. అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశానికి మార్గదర్శిగా, దిక్సూచిగా మారబోతోందని జోస్యం చెప్పారు. అమరావతికి ఎంతో గొప్ప చరిత్ర ఉందనీ, ఇక్కడి పురాతత్వ కట్టడాలను పరిరక్షించడానికి హృదయ్ పథకంలో చేర్చామన్నారు.
అమరావతిని గతంలో ఆంధ్రా ఆక్స్ ఫర్డ్ గా అభివర్ణించేవారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడకు వచ్చేవారని తెలిపారు. త్వరలో తొలిసారి ఓటు హక్కును పొందనున్న యువత ఈ ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని సూచించారు.