మూడో నామం పెట్టేందుకు గుంటూరు వస్తున్నారా?: మోదీపై కళా వెంకట్రావు మండిపాటు
- నాడు ప్రత్యేక హోదా ఇస్తామని నామం పెట్టారు
- ఢిల్లీని మించిన అభివృద్ధిని చేస్తామని మరో నామం
- మోదీకి బహిరంగ లేఖ రాసిన కళా వెంకట్రావు
భిన్నత్వంలో ఏకత్వమనే దేశ లక్షణానికి విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారని, తమ సామ, దాన, భేద, దండోపాయాలను టీడీపీ ఎంపీలు అధిగమించారని, అందుకే, లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టారని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నానని చెప్పుకోలేని స్థితికి వచ్చారని, ఇంతకుముందు జైల్లో ఉన్న జగన్ అండ్ కో తమ ముసుగులోని మిత్రులేనని ఆరోపించారు. నూతన రాష్ట్రానికి చాలా చేశామని చెప్పుకుంటున్నారని మోదీని విమర్శిస్తూ ఈ లేఖ రాశారు.