aukland: ఆక్లండ్ టీ20: టీమిండియా విజయలక్ష్యం 159 పరుగులు

  • 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసిన కివీస్
  • 50 పరుగులు చేసిన గ్రాండ్ హోమ్
  • మూడు వికెట్లు తీసిన కృణాల్ పాండ్యా

ఆక్లండ్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు కివీస్ ను కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ గ్రాండ్ హోమ్ 28 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తా చాటాడు. సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్ 36 బంతుల్లో 42 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో మన్రో 12, విలియంసన్ 20, మిచెల్ 1, శాంట్నర్ 7, సౌథీ 3 పరుగులు చేయగా... కుగ్లీన్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కృణాల్ పాండ్యా 3, అహ్మద్ 2 వికెట్లు తీయగా... భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 159 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ను ఆరంభించింది. రోహిత్ శర్మ, ధావన్ లు భారత ఇన్నింగ్స్ ను ఆరంభించారు. తొలి ఓవర్లో భారత్ 6 పరుగులు సాధించింది.

More Telugu News