నేడు సీఎంతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి భేటీ.. తర్వాత నిర్ణయం ప్రకటన!
- టీడీపీలో ఉంటారా...తనదారి తాను చూసుకుంటారా?
- సీఎంతో భేటీ అనంతరం నిర్ణయం చెబుతానన్న కృష్ణమోహన్
- ఇప్పటికే పలువురు కాపు నేతలతో చర్చ
దీంతో అప్రమత్తమైన అధిష్ఠానం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను రంగంలోకి దించింది. త్రిమూర్తులు పిలుపు మేరకు కృష్ణమోహన్ బుధవారం సాయంత్రం రామచంద్రాపురం వెళ్లి ఏకాంతంగా దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. పలువురు కాపు నేతలను కూడా ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నానని, ఆ తర్వాత తన తుది నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత కృష్ణమోహన్ నిర్ణయం ఏమిటన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.