హిజ్రా అవతారంతో దందా... ప్రశ్నించిన కానిస్టేబుల్‌పై దాడి

  • హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో ఘటన
  • కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు నిందితుడి అరెస్టు
  • మంచిర్యాలకు చెందిన వాడిగా గుర్తింపు
బతుకుదెరువు కోసం రకరకాల వేషాలు వేయడం చూస్తుంటాం. ఇతను ఏకంగా హిజ్రా వేషం వేశాడు. దందా మొదలెట్టాడు. పోలీసుల వరకు విషయం వెళ్లగా అడిగే సరికి వారిపైనే దాడికి దిగాడు. ఆ వివరాల్లోకి వెళితే... మంచిర్యాలకు చెందిన మాదిరాజు (23) బతుకుదెరువు వెతుక్కుంటూ హైదరాబాద్‌ నగరం వచ్చి సూరారంలో ఉంటున్నాడు.

ఈ క్రమంలో హిజ్రా వేషం ధరించి స్నేహగా పేరు మార్చుకున్నాడు. సుచిత్ర చౌరస్తా సమీపంలో వాహన చోదకుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఇవ్వనన్న వారిపట్ల దందా చేయడంతో కొందరు వాహన చోదకులు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న శ్యాంకుమార్‌ చౌరస్తాకు వెళ్లి రాజును ప్రశ్నించాడు. దీంతో రాజు కర్రతో కానిస్టేబుల్‌ తలపై మోది అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణలో అతను హిజ్రా కాదన్న విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. నేరం అంగీకరించడంతో కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.
Go Back to Shorts
Hyderabad
boyinpalli
hijra arrest

More Telugu News