ఒక దుర్మార్గుడు వచ్చి పార్టీ పెట్టి నీతి గురించి మాట్లాడుతున్నాడు: జగన్ పై స్పీకర్ కోడెల ధ్వజం
- అవినీతిలో ఉన్నోడికి అందరూ అలానే కనిపిస్తారు
- 40 ఏళ్లుగా నిప్పులా బతుకుతున్నా
- జగన్ రమ్మన్న చోటికి వస్తా.. చర్చకు సిద్ధమా?
నాలుగు దశాబ్దాలుగా నిప్పులా బతుకుతున్న తనపై జగన్ అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయమని కోడెల అన్నారు. తప్పు చేయాల్సి వచ్చిన రోజున రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. తాను తప్పుచేసినట్టు నిరూపించాలని, ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలన్నారు. లేదంటే, జగన్ ఎక్కడికి రావాలో చెబితే తానే అక్కడికి వెళ్తానని కోడెల సవాల్ విసిరారు.