జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఐదుగురి మృతి

  • ర్యాలీలో పాల్గొని తిరిగొస్తుండగా ప్రమాదం
  • డ్రైవర్ నిర్లక్ష్యంతోనే బస్సు బోల్తా
  • క్షతగాత్రులకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 30 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒక చిన్నారితో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. గాయపడినవారిని స్థానికులు దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దేవ్‌ధర్‌ జిల్లా కచ్వాబంద్‌లో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ అధికారి ఉపాధ్యాయ తెలిపారు. ప్రయాణికులంతా భాస్కర్ గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. వీరంతా దుంకా జిల్లాలో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులకు తక్షణ సాయం కింద 50 వేలు అందజేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రాజ్ పలివార్ తెలిపారు.
Go Back to Shorts
Jarkhand
Bus Accident
Raj Paliwar
vupadhyaya
Driver
Hospital

More Telugu News