ఐదేళ్లకు పైబడి ప్రభుత్వం కొనసాగితేనే అభివృద్ధి సాధ్యం: అమిత్ షా
- ‘భారత్ మన్ కీ బాత్..’ పేరిట ఎన్నికల ప్రచారం
- ‘పని చేసే వారి పైనే ప్రజలు నమ్మకం ఉంచుతారు’
- ప్రజల ఆశలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో ఉంటుంది
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, తమ కార్యకర్తలకు సంబంధించి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య వేడుక అని అన్నారు. ప్రజలను కలిసేందుకు కార్యకర్తలకు లభించిన ఓ మంచి అవకాశమిదని, మన ఆలోచనలను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. దేశ ప్రజల ఆశలను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ మేనిఫెస్టో ఉంటుందని, మేనిఫెస్టో రూపొందించే నిమిత్తం ప్రతి రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. ప్రజలు తమ సలహాలను ఓ పేపర్ పై రాసి తెలియజేయాలని, ఇందుకోసం, ఏర్పాటు చేసే బాక్సుల్లో వాటిని వేయాలని సూచించారు. అలాగే, ఈ-మెయిల్, కాల్ సెంటర్ల ద్వారా కూడా ప్రజల సలహాలను సేకరిస్తామని అమిత్ షా పేర్కొన్నారు.