ఏపీలో పండగ వాతావరణం నెలకొంది: నందమూరి సుహాసిని
- పింఛన్ల పెంపుపై ప్రజలు సంతోషంగా ఉన్నారు
- మహిళలకు ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది
- డ్వాక్రా గ్రూప్స్ తో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది
2014 కు ముందు రెండు వందలుగా ఉన్న పింఛన్ ని వెయ్యి రూపాయలు చేశారని, ఇప్పుడు దాన్ని రెండు వేలు చేయడంతో ప్రజలు ఆనంద పడుతున్నట్టు చెప్పారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని ప్రశంసించారు. డ్వాక్రా గ్రూప్స్ వల్ల మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లభించిందని, ఈ మహిళలకు పది వేల రూపాయలతో పాటు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనుండటంతో ఓ పండగ వాతావరణం నెలకొందని అన్నారు.